నితిన్ కోసం త్రివిక్రమ్ మార్క్ టైటిల్.. !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ ‘పవన్ క్రియేటివ్ వర్క్స్’ తన తొలి సినిమాని నితిన్ హీరోగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకుడు. కథ-స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఇప్పుడీ సినిమా కోసం త్రివిక్రమ్ మార్క్ టైటిల్ ని ఫైనల్ చేసినట్టు సమాచారమ్.
‘గుర్తుందా శీతాకాలం ?’ టైటిల్ ని ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఇదో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్. నితిన్ సరసన మేఘా ఆకాష్ జతకట్టనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. సంగీతం థమన్. థమన్ సంగీతం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఇక, పవన్ – త్రివిక్రమ్ ల ‘అజ్ఝాతవాసి’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ అజ్ఝాతవాసి హవా మొదలైపోయింది.
