పోలవరంకు జాతీయ హోదా అనడం మీనింగ్ లెస్..! : ఎంపీ వినోద్

బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ పై టీఆర్ఎస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్ నిరాశపరిచిందని, ఇది స్టేటస్ కో బడ్జెట్ మాదిరిగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందో అర్థం కాకుండా ఉందని, రెండు లక్షల కోట్లు కావాల్సి ఉంటే దీనికి కేవలం 2వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించారని విమర్శించారు.
పంటకు గిట్టుబాటు ధర విషయంలో కూడా స్పష్టత లేదని, అస్పష్టతతో ప్రజలను మభ్యపెడతాం అనుకోవడం సరికాదు.
రోడ్స్ విషయం లో టిఆర్ఎస్ ఎంపీలం అనుకున్నది సాధించామని,బడ్జెట్లో తెలంగాణకు ఒక్క ఎయిర్పోర్ట్ కూడా పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. జాతీయ హోదా ప్రాజెక్ట్ లకు కేంద్రాలు ఇప్పటి వరకు 100కోట్లకు మించి ఇవ్వలేదన్నారు.
పోలవరం కు జాతీయహోదా అనడం మీనింగ్ లెస్ అని అన్నారు ఎంపీ వినోద్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఏమైనా నిధులు ఇస్తారేమో నని ఆశించామని, ఎయిమ్స్ ఇస్తాము అన్న హామీని జైట్లీ ఈ బడ్జెట్ లో నిలుపుకోలేదని విమర్శించారు.
