కృష్ణ.. కృష్ణా.. ఎప్పటికయ్యేనో..!!

కృష్ణా నీటి కేటాయింపుల విషయంలో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. జలసౌధలో సమావేశమైన కృష్ణా రివర్ బోర్డు తెలుగు రాష్ట్రల నదీ జలాల వినియోగంపై వాడివేడి చర్చ జరిగింది. కొత్త ప్రాజెక్టులకు నీటి కేటాయింపు, టెలిమెట్రిల ఏర్పాటు, నీటి వినియోగం, వాటాలపై ప్రధానంగా వాదనలు జరిగాయి. ఇరు రాష్ట్రల మద్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమస్య పరిష్కారం కాకపోవడంతో నదీజలాల పంపకం ఇంకా పెండింగ్ లోనే ఉంది. మరోసారి సమావేశమై చర్చిస్తామని కృష్ణా బోర్డు నిర్ణయించింది.
రెండు రాష్ట్రలు తమ వాదనలు వినిపించాయని, కొన్ని సమస్యలకు మాత్రమే పరిష్కారం లభించిందని, కొత్త ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రలు అవగాహనకు రావాల్సినవసరం ఉందని కృష్ణా రివర్ బోర్డు ఇంచార్జ్ సాహు తెలిపారు. నీటి పంపకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.
