స్వీటీతో శింబు రొమాన్స్.. ప్రభాస్ ఫీలవుతాడేమో !

స్వీటీ అనుష్క శింబు ప్రేయసిగా ప్రచారం జరుగుతోంది. అరె.. ప్రభాస్ స్థానంలోకి శింబు ఎప్పుడొచ్చాడు ? ఇంతకీ వీళ్లిద్దరికి ఎక్కడ లింకు కుదిరింది.. ?? అంటే గౌతమ్ మీనన్ సినిమాతో. ‘భాగమతి’ తర్వాత అనుష్క ఓకే చెప్పిన సినిమాల్లో గౌతమ్ సినిమా ఒకటి. ఇప్పుడీ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ‘వీన్నైతాండి వరువాయా’ (తెలుగులో ‘ఏమాయ చేసావె’) గౌతమ్ మీనన్ హాట్ సినిమా. ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నాడు గౌతమ్. ఈ సినిమాలో శింబు ప్రేయసిగా అనుష్క కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.
‘వీన్నైతాండి వరువాయా’లో శింబు-త్రిష జంటగా నటించారు. తెలుగు ‘ఏమాయ చేసావె’ సినిమాలో నాగచైతన్య, సమంత జంటగా నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక, శింబు, అనుష్క జంటకు కూడా మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరు గతంలో ‘వానమ్’ సినిమాలో నటించారు. శింబు-అనుష్క రొమాన్స్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతారేమో.. !
‘భాగమతి’ తర్వాత అనుష్క మాధవన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నది. ఆది పినిశెట్టి హీరోగా మరో సినిమా ఓకె చేయినట్టు తెలిసింది. ‘నా నువ్వే’ సినిమాను నిర్మించిన నిర్మాతలు ఓ మాంచి హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ రెడీ చేసారు. వాళ్లు కూడా అనుష్కతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి అనుష్కతో ఓ సినిమా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇందులో నాని కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్.
