కాజల్ మనసు ఏం కోరుకుంటుందో తెలుసా ?

పనైపోయిందనుకొన్న కాజల్ మళ్లీ ఫాంలోకి వచ్చేసింది. యంగ్ హీరోయిన్లకి దీటుగా అవకాశాల్ని అంది పుచ్చుకొంటోంది. కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తోంది. దర్శకులు నా కోసం పాత్రల్ని సృష్టిస్తున్నంత కాలం నటిస్తూనే ఉంటానని చెబుతోంది కాజల్. ఇప్పటికీ తన మనసు సాహాసాలు చేయాలని కోరుకుంటుందని చెబుతోంది. ‘‘నటులు ఎవరికైనా ఓ మంచి పాత్ర ఇచ్చే తృప్తే వేరు. అయితే తొలినాళ్లలో పాత్రల గురించి ఎంత ఆలోచించేదాన్నో, బాక్సాఫీసు పరంగా ఫలితాల గురించీ అంతే ఆలోచించేదాన్ని. కానీ, ఇప్పుడు ఆ తీరు మారింది. మంచి పాత్ర అనిపిస్తే… దానికోసం ఎన్ని సవాళ్లకైనా సిద్ధం కావాలనిపిస్తుంది. దాని ఫలితం గురించీ, ఇతరత్రా లెక్కల గురించి ఆలోచనలే రావు. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రలు చేయడంపైనే నా దృష్టంతా’’ అంటోంది కాజల్.
