నాగశౌర్యలో మేటరు లేదట

యంగ్ హీరో నాగశౌర్యలో మేటరు లేదట. ఈ విషయాన్ని స్వయంగా నాగశౌర్య తండ్రి చెప్పడంతో అందరు నమ్మేస్తున్నారు. ఐతే, ఇదంతా @నర్తనశాల టీజర్ లోని సీన్. ‘ఛ‌లో’ తర్వాత నాగశౌర్య సొంత బ్యానర్ లో తెరకెక్కుతోన్న చిత్రమిది. సిమ్రాన్‌ పరీన్జా హీరోయిన్. దర్శకుడు వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్రబృందం.

@నర్తనశాల టీజర్ ని వినోదభ‌రితంగా కట్ చేశారు. నాగశౌర్య తండ్రి శివాజీ రాజా ‘నా కొడుకు గేనా… ! అంటూ కంగారుపడిపోతున్న సీన్ హైలైట్ ఉంది. ‘పెళ్లంటే ఫీలింగ్స్ రావాలి కాదా’, చిన్నప్పటికి అలా వాడ్నిఆడపిల్లలా అలా చెప్పితే.. ఆ ఫీలింగ్స్ ఎలా వస్తాయి.. అనే డైలాగ్స్ హీరో పాత్రపై మరింత ఆసక్తిని పెంచేలా కనిపిస్తోంది. ఓ యాక్షన్ బిట్ ని టీజర్ లో చూపించారు. మొత్తంగా.. @నర్తనశాల టీజర్ సినిమాపై అంచనాలని పెంచేలా ఉంది.

ఇప్పటికే ‘నర్తనశాల’ ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలైపోయింది. శాటిలైట్ కి మంచి గిరాకీ ఏర్ప‌డింది. హిందీ శాటిలైటు రేటు ఏకంగా రూ.2.75 కోట్లకు అమ్మేశారు. ఈ రేటు నర్తనశాల సినిమా అంచనాలని పెంచేస్తోంది. ఓ యంగ్ హీరో నటించిన సినిమా హిందీ శాటిలైట్ ఈ రేటు పలకడం గొప్పవిషయమే. ఈ సినిమాని ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.