బాడీ పెంచే పనిలో తారక్‌.. !


ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పీరియడ్‌ డ్రామాగా, బ్రిటిష్‌ కాలంలో జరిగిన కథతో దీన్ని రూపొందిస్తున్నారట. అయితే, ఎన్టీఆర్‌ పాత్ర రెండు వైవిధ్యమైన షేడ్స్‌ను కలిగి ఉంటుందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఒక లుక్‌లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేయగా, మూడో షెడ్యూల్‌ కోసం ఇంకాస్త బాడీ పెంచే పనిలో ఉన్నాడట తారక్‌.

తారక్‌ పాత్రలో ప్రతినాయకుడి ఛాయలు కనిపిస్తాయని, తను అడవి దొంగగా కనిపించబోతున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ సాధారణంగా, ఇంకొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో ఉంటారట. అందుకోసం తారక్‌ తన బాడీని మేకోవర్‌ చేసే పనిలో ఉన్నారట.