కేజ్రీవాల్’ను చంపేయాలనుకుంటున్నారా.. ?

ఢిలీ సీఎం క్రేజీవాల్ పై శనివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. మోతీనగర్ లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ యువకుడు
కేజ్రీవాల్ చెంప పగలగొట్టాడు. ఈ ఘటనపై ఆదివారం క్రేజీవాల్ మీడియా సమావేశం నిర్వహించారు తనపై దాడి జరగడం ఇదేం కొత్తకాదు. గత ఐదేళ్లలో తనపై 9సార్లు దాడులు జరిగాయన్నారు. దేశం మొత్తమ్మీద కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రి రక్షణ మాత్రమే బీజేపీ నేతల చేతుల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దాడి వెనక బీజేపీ ఉంది. బీజేపీ నేతలే ఈ దాడి చేయించారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్ ను చంపేయాలనుకుంటున్నారా? అని మండిపడ్డారు. ఇక సీఎం క్రేజీవాల్ పై యువకుడి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై టీవీ ఛానెల్స్ ప్రత్యేక చర్చవేదికలు ఏర్పాటు చేస్తున్నాయి.