పవన్ సింపుల్ సెలబ్రేషన్స్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. ఆ పార్టీ కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరితమైంది. ఆ పార్టీ అధినేత, పవర్ స్టార్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పెద్దగా బయట కనిపించడం లేదు. బుధవారం రంజాన్ వేడుకల్లోనూ పవన్ హడావుడి కనిపించలేదు. చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకొన్నారు.

అతికొద్ది మందితో కలిసి పవన్ రంజాన్ ని సెలబ్రేట్ చేసుకొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు, ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ తొలిసారి ఈరోజు విజయవాడ వెళ్లనున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలకి చెందిన నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ ఓటమిపై నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. త్వరలో జరగనున్న ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులని సమాయాత్తం చేయనున్నారు.

