నిర్మాతగా అనసూయ ?

హాట్ యాంకర్ అనసూయ ఇప్పటికే రెండు పడవలపైనా ప్రయాణం చేస్తోంది. ఓ వైపు బుల్లితెరని ఏలుతూనే.. వెండితెరపై మంచి అవకాశాలని పొందుతోంది. వాటిని సద్వినియోగం చేసుకొంటూ మంచి నటి అనిపించుకుంటోంది. సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, రంగస్థలం సినిమాల్లో అనసూయ నటనకి మంచి మార్కులు పడ్డాయి. బుల్లితెర, వెండితెర అనే తేడా ఏంటీ ? ఎక్కడైనా నటించడమే కాదా. ప్రస్తుతం యాంకర్ గా, నటిగా ఫుల్ బిజీ.
త్వరలో అనసూయ నిర్మాతగా మారబోతున్నట్టు సమాచారమ్. తన దగ్గరికి వచ్చిన ఓ కథని నచ్చి, మెచ్చి నిర్మాతగా మారేందుకు ఒప్పుకొందట. ఐతే, అది సినిమానా ? వెబ్ సిరీస్ నా ?? అన్నది తెలియాల్సి ఉంది. ఇన్నాళ్లు యాంకర్ గా, నటిగా అనసూయ బాగానే వెనకేసుకొచ్చినట్టుంది. ఇప్పుడా డబ్బుతో నిర్మాతగా మారి అభిరుచి గల సినిమాలని నిర్మించాలన్నది అనసూయ కోరికని చెబుతున్నారు. మరీ.. నిర్మాతగా అనసూయ ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి.
