మహేష్ కోసం కాస్ట్లీ సెట్స్


‘మహర్షి’ మురిపెం ముగిసింది. మహేష్ మునుపెన్నడూ లేనంతగా ‘మహర్షి’ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేశాడు. స్కూల్స్, కాలేజీలు, థియేటర్స్ ని సందర్శించారు. ఒకటి కాదు రెండు సార్లు కాలరెగిరేశాడు. మహర్షి సెలబ్రేషన్స్ ముగించుకొని ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లొచ్చాడు. రాగానే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ఫోకస్ పెట్టారు.

ఈ సినిమా తొలి షెడ్యూల్ త్వరలోనే కాశ్మీర్ లో ప్రారంభం కానుంది. ఇప్పటికే చిత్రబృందం కాశ్మీర్ చేరుకొంది. అక్కడ మహేష్ జవాన్ గా కనిపించే సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఇందులో ఒకట్రెండు యాక్షన్స్ సీన్స్ ని కూడా ఉన్నాయి. తిరిగొచ్చాక హైదరాబాద్ లో లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఇందులో రెండు కాస్ట్లీ సెట్స్ వేస్తున్నారు.

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రైయిన్ సెట్ తో పాటు విజయశాంతి ఇల్లు సెట్ వేస్తున్నారు. ‘వెంకీ’ సినిమాలో తరహా ఇందులోనూ ట్రైన్ సీన్ ఉండనుంది. అది కడుపుబ్బ నవ్విస్తుందని చెబుతున్నారు. ఇక, విజయశాంతి ఇంటిని ప్రత్యేకంగా డిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సెట్స్ కోసం ఏకంగా నాలుగైదు కోట్లు ఖర్చుపెట్టబోతున్నారంట.

ఎఫ్ 2 తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో మహేష్ కు జంటగా రష్మిక మందన జతకట్టనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.