చూపులతో రేప్ చేశాడట


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇషా గుప్తాకు రెస్టారెంట్ లో చేధు అనుభవం ఎదురైంది. ఆమె పట్ల రెస్టారెంట్ యజమాని అసభ్యంగా ప్రవర్తించాడట. అలాగని ఆయన ఇషాని తాకలేదు. బలవంతపెట్టలేదు. అసభ్యంగా మాట్లాడలేదు. కానీ, చూపులతోనే రేప్ చేసినంత పని చేశాడట. ఈ విషయాన్ని చెబుతూ మహిళల భద్రతపట్ల ఇషా ఆందోళన వ్యకం చేసింది.

శనివారం ఈషా తన స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారట. ఈ రెస్టారెంట్‌ను రోహిత్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈషా తన స్నేహితులతో కూర్చుని విందు చేస్తున్నప్పుడు ఆమె ఎదురుగానే కూర్చుని రోహిత్‌ వికృతంగా చూస్తున్నారట. దీంతో ఇషాకి మండింది. వెంటనే రోహిత్ ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఓ రేంజ్ లో క్లాస్ పీకుతూ కామెంట్ పెట్టింది.

“నాలాంటి అమ్మాయికే ఈ దేశంలో భద్రత లేకపోతే మిగతా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో తెలీడంలేదు. నాతో పాటు ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ నన్ను రోహిత్‌ చూపులతో అత్యాచారం చేస్తున్నట్లుగా అనిపించింది. నన్ను గుచ్చి గుచ్చి చూస్తూ నా చుట్టూ తిరుగుతూ ఎంతో అసహ్యంగా ప్రవర్తించాడు. అతను నన్ను ముట్టుకోలేదు. ఏమీ అనలేదు. కానీ అతని చూపు చాలు ఓ ఆడది అసౌకర్యానికి గురవడానికి. మహిళలకు భద్రత ఎక్కడుంది? మహిళలా పుట్టడమే శాపమా?” అని ట్విట్ చేసింది.