బిగ్ బాస్ 3 : అలీకి కన్నీటి వీడ్కోలు

టైటిల్ ని చూసి ఇది విషాద వార్త అనుకొనేరూ. బిగ్ బాస్ 3 ముచ్చట. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలని పూర్తి చేసుకొంది. ఏడోవారం అలీ రెజా ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయం ముందే బయటికి లీకవ్వడంతో ప్రేక్షకులు షాక్ కి గురికాలేదు. కానీ హౌస్ సభ్యులకి మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. తొలిసారి ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చిన అలీ ఎలిమినేట్ అవుతారని హౌస్ సభ్యులు ఎవరూ ఊహించలేదు. అలీ ఎలిమినేట్ కావడంతో హౌస్ లో కన్నీటి వరద పారింది.
శివజ్యోతి, శ్రీముఖీ అలీ ఎలిమినేషన్ ని జీర్ణించుకోలేకపోయారు. వీరిద్దరే కాదు.. హౌస్ సభ్యులందరు కంటతడిపెట్టుకొన్నారు. హౌస్ సభ్యుల ప్రేమని చూసిన అలీ తాను గెలిచానని నాగ్ తో చెప్పారు. బిగ్ బాస్ 3కి సగం విన్నర్ ని నేనే. మిగితా సగం విన్నర్ మీలో ఒకరు కాబోతున్నారని చమత్కరించాడు. బిగ్ బాస్ హౌస్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసినందుకు హ్యాపీగా ఉందన్నారు.
ఐతే, ఒక్కసారి కూడా ఎలిమినేషన్ లోకి రాకపోవడమే పెద్ద మైనస్. అదే తన ఎలిమినేషన్ కి కారణం. ఎలిమినేషన్ లోకి రాకపోవడంతో తనని సేవ్ చేయడానికి ఎవరు ప్రయత్నించలేదు. తనకి ఫ్యాన్ ఫ్యాలోయింగ్, గ్రూపులు ఏర్పడే అవకాశాలు తగ్గాయ్. అదే తన ఎలిమినేషన్ కి కారణమని భావిస్తున్నట్టు అలీ చెప్పారు. ఇక పోతు పోతూ.. బిగ్ బాంబ్ ని రవికృష్ణపై వేశాడు. రవి ప్రతిరోజు గంటసేపు జిమ్ చేయాల్సి ఉంటుంది. ఆ బిగ్ బాంబ్ ని రవికృష్ణ సంతోషంగా స్వీకరిస్తున్నట్టు తెలిపాడు.
