డబ్బుకోసమే ఇల్లీని వదిలేశాడట !

టాలీవుడ్ తొలి కోటి కథానాయిక ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పర్వాలేదనిపించింది. కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడింది. సినిమాలేక దొరికిన ఖాళీ సమయాన్ని బోయ్ ఫ్రెండుతో ఎంజాయ్ చేసింది. ప్రేమని నెక్ట్ లెవల్ కి తీసుకెళ్దామని, సినిమాలు లేకపోయినా.. ఆండ్రూని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోదామని ఇల్లీ భావించింది. కానీ, ఆండ్రూ ఆలోచనలు వేరేగా ఉన్నాయట. ఆయన ఇల్లీని వద్ద డబ్బుని చూసే లవ్ చేశాడట. ఇల్లీ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో తెగ ఎంజాయ్ చేశాడట. ఇల్లీని సినిమాలు చేయమని బలవంతం చేశాడట.
అలా ప్రియుడు ఒత్తిడితో ఇష్టం లేకపోయినా కొన్ని సినిమాలు చేసింది ఇల్లీ. అవి ప్లాప్ కావడంతో ఇల్లీకి మరిన్ని అవకాశాలు రాలేదు. దీంతో ప్రియుడు ఆండ్రూకి ఇల్లీతో పెళ్లికి మొహం చాటేశాడట. అదే ఇల్లీ బ్రేకప్ కి కారణమని సమాచారమ్. ప్రియుడుతో బ్రేకప్ అయిందని చెప్పిన ఇల్లీ.. దాని వెనక అసలు కారణం మాత్రం చెప్పడం లేదు. ప్రియుడి చేతితో దారుణంగా మోసపోయినా.. ఇల్లీ మళ్లీ హీరోయిన్ గా రాణించాలని ఆశపడుతోంది. ఇందుకోసం మళ్లీ సన్నజాజిలా మారేందుకు కసరత్తులు చేసేంది. బాగా సన్నబడే పనిలో ఉంది. అంతేకాదు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్. పారితోషికం ఎంత ఇచ్చినా ఓకే.. చిరు సినిమాలో ఛాన్స్ ఇస్తే చాలంటోంది.
