శేఖర్ కమ్ముల సినిమా.. కథ లీకు !


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయిపల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఫిదా’ తర్వాత కమ్ముల చేస్తున్న చిత్రమిది. సోమవారమే సినిమా ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడీ సినిమా షూటింగ్ షెడ్యూల్ వివరాలు, స్టోరీ లైన్ బయటికొచ్చాయ్. ఇదో మ్యూజికల్ లవ్ స్టోరీ అని తెలిసింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం చైతూ తెలంగాణ యాసని నేర్చుకొంటున్నారు. 

ఫిదా సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీన్ రివర్స్ కానుంది. ఈసారి కథానాయకుడు చైతూ తెలంగాణ పోరడుగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరో-హీరోయిని జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో కనిపిస్తారు. పల్లెటూరునుంచి పట్నం వచ్చిన వీరు ఎలా తమ లక్ష్యాన్ని చేరుకొన్నారు అనేది సినిమా కథ అని చెబుతున్నారు. ఇక ఈ సినిమాని మూడు షెడ్యూల్ లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తొలి షెడ్యూల్ ని 10రోజులు నిర్వహించనున్నారు. తన శైలికి భిన్నంగా జెడ్ స్పీడుతో సినిమాని పూర్తి చేసేందుకు కమ్ముల ప్లాన్ చేసినట్టు టాక్.