బట్ట తలపై జుట్టు పెంచుకోవడానికి హీరో పడిన పాట్లు చూడండీ.. !


బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజా చిత్రం ‘బాల’. యామీ గౌతమ్, భూమి పెడ్నేకర్  కథానాయికలు.  అమర్ కౌశిక్ దర్శకుడు. గురువారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. జుట్టు పెంచుకోవడానికి ఆయుష్మాన్ ఖురానా పడిన తిప్పలు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. బట్టతలపై జుట్టు పెంచడానికి మార్కెట్ లో ఉన్న అన్ని రకాల ఉత్పత్తులను వాడాడు. స్ప్రేలు, పౌడర్లు, విగ్ లతో పాటు, ఆవు పేడను కూడా తలపై రుద్ది ప్రయత్నించాడు. కానీ, ఫలితం కనపడలేదు. ట్రైలర్ తోనే ఈ రేంజ్ లో నవ్విస్తే.. థియేటర్స్ లో నవ్వి నవ్వి పొట్ట చెక్కలు కావాల్సిందే.. !