‘కంటి వెలుగు’ లక్ష్యాలు ఇవే !


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటివెలుగు కార్యక్రమంలో నవంబర్‌ 1, డిసెంబర్‌ నెలాఖరు మధ్య సమగ్ర పరీ క్షలు నిర్వహించనున్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు, కళ్లజోళ్లు, ఇతర వైద్యసాయం అందిస్తారు. అనంతపురం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ‘వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడారు. 1.2 కోట్ల మందికి కంటి సమస్యలున్నాయన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందరికీ కంటి చికిత్సలు అందిస్తామన్నారు. తొలి విడతలో 70 లక్షల మంది స్కూల్‌ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

రెండో దశలో 400 బృందాలతో విద్యార్థులకు కంటి పరీ క్షలు నిర్వహిస్తామన్నారు. ఉచితంగా శస్త్ర చికిత్సలతో పాటు కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. రూ.560 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా కంటి చికిత్సలు నిర్వహిస్తామన్నారు. మూడు నుంచి ఆరు దశల్లో వృద్దులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.