బన్నీతో రొమాన్స్ బాగుంటుంది : పూజా హెగ్డే 

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ-పూజాల మధ్య లవ్ ట్రాక్ హైలైట్ గా ఉండనుందట. ఈ విషయాన్ని స్వయంగా పూజా హెగ్డే నే తెలిపింది.
 
ఇటీవల పూజా హెగ్డే ఓ  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో తాను అల్లు అర్జున్ కి బాస్ గా కనిపిస్తా. నేను చాలా కఠినంగా ఉంటా. నేను బన్నీని ఏడిపించే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి. సినిమాలో తనకు, బన్నీకి మధ్య వచ్చే లవ్ ట్రాక్ హైలైట్ గా నిలుస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పారిస్ లో జరుగుతోంది.

ఫ్రాన్స్ లోని కొన్ని అందమైన లొకేషన్లలో సామజవరగమన పాటను షూట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా అల.. వైకుంఠపురంలో వచ్చే యేడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్, గీతాఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.