ప్రభాస్ ని కలిసిన సాహో విన్నర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని అభిమానులు కలుసుకొన్నారు. ఇది సాధారణ విషయమే కదా అనుకొనేరు. తాజాగా ప్రభాస్ ని కలిసిన అభిమానులకి ఓ ప్రత్యేకత ఉంది. ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్ర రిలీజ్ సమయంలో మేకర్స్ కాంటెస్ట్ నిర్వహించగా, అందులో విజేతగా నిలిచిన వారు ప్రభాస్‌ని కలిసే ఛాన్స్ పొందుతారని చెప్పారు.
ఇందులో భాగంగా కాంటెస్ట్ విన్నర్స్ ప్రభాస్‌ని కలిశారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఆ సమయంలో అభిమానుల ఆనందం అవధులు దాటిందని చెప్పాలి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో అంచనాలని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కోసం ‘జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. యూరోప్ నేపథ్యంలో 1960ల కాలం నాటి ప్రేమకథగా జాన్ మూవీ తెరకెక్కుతుంది.
