‘జాన్’ కొత్త షెడ్యూల్ వివరాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత చేస్తున్న సినిమా ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). జిల్ ఫేమ్ రాథాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రమిది. ప్రభాస్ ప్రేయసిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలోనే హైదారాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఈ మేరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
ఇక 2020లో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మీడియాతో మాట్లాడిన ప్రభాస్ పెద్దమ్మ ‘జాన్’ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ పెళ్లి ఉండనుందని తెలిపారు. మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాం. మా కుటుంబంలో కలిసిపోయే అమ్మాయి కోసం చూస్తున్నాం అన్నారు. భీమవరానికి చెందిన అమ్మాయి అయితే ఇంకా బెటర్ అన్నట్టుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ యేడాది ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు. పెళ్లి భోజనం పెట్టబోతున్నాడని ఆయన అభిమానులు చెప్పుకొంటున్నారు.
#Prabhas20 shoot new schedule start from this week at AnnaPurna studios in Hyderabad
Young Rebel Star #Prabhas @hegdepooja #Gopikrishnamovies @UV_Creations @director_radhaa
— BARaju (@baraju_SuperHit) January 1, 2020
