ఇప్పటికీ బన్నీతో మహేష్ పోటీ.. కానీ !

సంక్రాంతి సినిమాల హీటు ఇప్పటికీ చల్లారడం లేదు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఫస్ట్ లుక్ నుంచే పోటీ పడ్డాయి. పోస్టర్స్, పాటలు, టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతి విషయంలో పోటీపడ్డాయి.

సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్స్, రికార్డుల విషయంలోనూ పోటీ పడ్డాయి. పోటాపోటాగా రూ. 50కోట్లు, రూ.100కోట్లు, రూ. 200కోట్ల వసూళ్ల పోస్టర్ ని రిలీజ్ చేశాయి. అయితే, ప్రతి సందర్భంలోనూ అల.. వైకుంఠపురంలో సినిమా ముందు కనిపించింది. ఇప్పటికీ అల.., సరిలేరు సినిమాలు పోటీ పడుతూనే ఉన్నాయి.

అల.. వైకుంఠపురంలో నుంచి వీడియో సాంగ్స్ క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సామజవరగమన, బుట్టబొమ్మ, ఓ మై డాడీ.. ఫుల్ వీడియో సాంగ్స్ వచ్చేశాయి. తాజాగా రాములో రాముల వీడియో సాంగ్ వచ్చేసింది. అయితే.. రాములో రాముల కి పోటీగా సరిలేరు నుంచి ‘సూర్యుడివో చంద్రుడివో.. ‘ ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.