ప్రధాని పిలుపునకి స్పందించండి.. కరోనాని అంతమొందించండి !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సరైన సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. కరోనా కట్టడి కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. కరోనాపై జాగ్రత్తలు చెబుతూ ఇప్పటికే ఒకట్రెండు వీడియోలు షేర్ చేశారు చిరు. ఓ పాట కూడా పాడారు. దానికి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు కూడా అందుకునన్నారు. తాజాగా రేపటి ప్రధాని పిలుపుని విజయవంతం చేయాలని కోరుతూ చిరు.. తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

“మన గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రేపు ఆదివారం రాత్రి సరిగ్గా 9గంటలకి 9నిమిషాల పాటు మనమందరం మన కుటుంబ సభ్యులతో కలిసి మన ఇంటి బయటకు, మన ఆరుబయటకు వచ్చి కొవ్వొత్తులు గానీ, సెల్ ఫోన్ ఫ్లాష్ లు గానీ, అలాగే టార్చ్ లైట్స్ గానీ వెలిగించి సంఘీభావాన్ని తెలుపుదాం. కరోనాని తుదముట్టించడానికి భారతీయులందరూ ఒక్కటయ్యారన్న సందేశాన్ని ప్రపంచదేశాలకి చాటి చెబుదాం. రండీ.. భారత ప్రధాని పులునకి స్పందించండి.. కరోనాని అంతమొందించండి. అందరు ఒక్కటై వెలుగులు నింపండి. జై హింద్” అని చిరు కోరారు.