తెలంగాణలో కొత్తగా 11 కేసులు

తెలంగాణలో కొత్తగా 11 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. దాదాపు 7గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినేట్ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. ఆ విశేషాలని సీఎం కేసీఆర్ మీడియాకి వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 439 మంది చికిత్సపొందుతున్నారు. మిగితావారు డిశ్ఛార్జ్ అయ్యారని తెలిపారు.