ఆగస్టుకే కరోనా వాక్సిన్ : కేసీఆర్

రాష్ట్రంలో కరోనా వాక్సిన్ తయారీ కోసం సీరియస్ గా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నాటికే వాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. దేశానికి, ప్రపంచానికి పెద్ద మేలు చేసినోళ్లం అవుతం అన్నారు సీఎం కేసీఆర్. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. దాదాపు 7గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినేట్ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. ఆ విశేషాలని సీఎం కేసీఆర్ మీడియాకి వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 439 మంది చికిత్సపొందుతున్నారు. మిగితావారు డిశ్ఛార్జ్ అయ్యారని తెలిపారు.
