ఆచార్య ఐటమ్ అనసూయ ?

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 30నిమిషాల నిడివి ఉన్న పాత్ర అది. ఇందులో చిరు కాంబోలో 10నిమిషాల పాటు సీన్స్ ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు.. చరణ్ కోసం కొరటాల రెండు మార్పులు చేశారని కూడా తెలిసింది. చరణ్ కోసం ప్రత్యేకంగా రెండు పాటలు డిజైన్ చేశారట.
ఇందులో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉందట. ఈ ఐటమ్ సాంగ్ లో చరణ్ తో కలిసి అనసూయ స్టెప్పులేయనుందని లెటెస్ట్ న్యూస్. ఇప్పటికే ఈ సినిమాలో చిరుతో కలిసి రెజీనా మాస్ సాంగ్ చేయగా, అనసూయ స్పెషల్ డ్యాన్స్‌పై క్లారిటీ రావలసి ఉంది. అనసూయ కేవలం పాటకే పరిమితం కానుందా.. ? లేక కీలక పాత్రలో కనిపిస్తూ.. ఐటమ్ సాంగ్ లో మెరుస్తుందా ?? అన్నది తెలియాల్సి ఉంది.
