నారా లోకేష్.. ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు : బండ్ల

టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరు తెచ్చుకొని.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. హంగామా చేసి.. అందులో ఇమడలేక బయటికొచ్చిన నటుడు బండ్ల గణేష్. ఇప్పుడు సడెన్ గా తెదేపా యువనేత నారా లోకేష్ పై పడిపోయాడు. ఆయనపై ట్విట్ల వర్షం. తిట్ల వర్షం కురిపించారు. మీరంటే.. గౌరవం అంటూనే లోకేష్ ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు. కేటీఆర్, ఎన్ టీఆర్ ఎదగాలి. ఉండాలి. మీరు మాత్రం రాజకీయంగా ఎదగలేరు. మీరు ఓ.. ఫెల్యూర్ రాజకీయ నాయకుడు అంటూ విరుచుకుపడ్డారు. ఇంతకీ బండ్ల ఏం.. ట్విట్టడాంటే.. ?
“గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రేమతో.. రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం. కానీ అది చాలా కష్టం అని వదిలేసా. రాజకీయ నాయకుడి లక్షణాలు దమ్ము, ధైర్యం ప్రజల్లో నమ్మకం, పోరాడుతాడు అన్న విశ్వాసం కల్పించడం. ఈ ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే దక్కే అదృష్టం మీకు దక్కడం నిజంగా మీ అదృష్టం. చంద్రబాబు నాయుడు కుమారుడు గా మీ అదృష్టం. రాజకీయ పార్టీ అంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. మన దగ్గర మన పార్టీ పార్టీలో నాయకులు అందరూ మన దగ్గర ఎంప్లాయిస్ కాదు. ప్రతి ఒక్కరినీ ప్రేమించి, ప్రేమను పంచి మనలో ఒకరిగా చేసుకుని, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటాను.
మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మీ తండ్రి మీ గురించి గర్వంగా నిద్రపోయే రోజు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య ట్విట్టర్లో మీరు చేసిన కామెంట్లు మిమ్మల్ని ఇష్టపడేవారు చాలామంది బాధపడుతున్నారు. మీరు అద్భుతంగా పనిచేసి ప్రజలలో నారా లోకేష్ తండ్రి చంద్రబాబు అని చెప్పుకునే విధంగా మీ రాజకీయం ఉండాలని, మీరు ఆ విధంగా ప్రజా పోరాటం లో భాగం కావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుడు గా పనిచేసిన ఆయన మంత్రివర్గంలో పనిచేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ లాగ ఉండాలి.
నాకిష్టమైన రాజకీయ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తన నలభై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతూ ఉంటారు. తండ్రి చనిపోయిన తర్వాత ప్రత్యర్ధులు అందరూ ఒకటే ఇబ్బడిపెట్టాలని చూసినా వారిని ఎదిరించి తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి లా ఉండాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తోంది. రాజకీయాల్లో పట్టు సాధించలేరని. కానీ మీరు నెంబర్ వన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఏ విధంగా తయారయ్యారో మీరు కూడా ఆ విధంగానే తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
మొన్నీమధ్య తిరుపతి దేవస్థానం చైర్మన్ స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తే మీరు చేసిన ట్విట్స్ మీ దిగజారుడుతనానికి. రాజకీయ నాయకులకు 3 కావాలి 1 వాళ్లపై వాళ్ల నమ్మకం రెండు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు నమ్మి రావడం. మూడు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరినీ మీరు నమ్మడం. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఎవరి తో అనుబంధం లేదు. కానీ మీరంటే మీ నాన్న గారు అంటే నాకు గౌరవం.మీ తాత గారు అంటే నాకు ఎంత ప్రేమో. అందుకోసమే మీకు ఈ విన్నపం.ఎవరు ఏ విధమైన సపోర్ట్ చేయకపోయినా నెంబర్ వన్ పొజిషన్ వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా మీరు ఉండాలి. చంద్రబాబు నాయుడు కుమారుడుగా తప్ప రాజకీయంగా మీకు ఏ అర్హత లేదు. ఎందుకంటే నాకు తెలిసి మీరు ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు. ప్రేమతో మీ బండ్ల గణేష్” అంటూ ట్విట్ల వర్షం కురిపించారు.
గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రేమతో @naralokesh 🙏
— BANDLA GANESH (@ganeshbandla) May 5, 2020
రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం కానీ అది చాలా కష్టమని వదిలేసా @naralokesh
— BANDLA GANESH (@ganeshbandla) May 5, 2020
