కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ ఓటీటీ రిలీజ్ పోస్టర్

కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘పెంగ్విన్’. తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.
ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 19న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు. తాజాగా రిలీజ్ డేటు పోస్టర్ ని వదిలారు. దీంతో పాటు ఈ నెల 8న టీజర్ ని వదలబోతున్నట్టు తెలిపారు. ఇక తెలుగు నుంచి మరో సినిమా ఓటీటీ రిలీజ్ ఖరారైంది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ఓటీటీ రిలీజ్ ఖాయమైంది. త్వరలోనే రిలీజ్ డేటు రానుంది.
