ఆరోగ్య శ్రీ’లోకి కరోనా చికిత్స.. కేసీఆర్ ఏమన్నారంటే ?

కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీ పథకంలోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ దీనిపై ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దీనిపై ఆలోచిస్తాం. ఇది మంచి సూచనే అన్నారు. దీంతో పాటు కరోనా చికిత్సకు ప్రయివేటు ఆసుపత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారితో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సూచించింది. దీనికి కూడా సీఎం కేసీఆర్ ఒప్పుకున్నారు.
ఇక కరోనా టైమ్ లో బాగా ఇబ్బందులు పడిన ప్రయివేటు టీచర్స్, కూలీల విషయంలో ఏదైనా ఆర్థిక ప్యాకీజీ ప్రకటిస్తే బాగుంటుందని.. కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలు సూచించాయి. దానికి కూడా సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. దీనిపై ఆలోచిస్తామన్నారు. ఇక కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టంపై శుక్రవారం అసెంబ్లీ సుదీర్ఘంగా చర్చిద్దాం. దీనిపై ప్రతిపక్షాలు కూడా మేధావుల నుంచి చర్చించి సలహాలు తీసుకోవాలి. ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇవ్వాలి. వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం కేసీఆర్.
