TSలో ప్రతిరోజూ 10లక్షల మందికి కరోనా వాక్సీన్

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ మొదలు కాలేదు. దీనిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తం. కరోనా ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పడుతోంది. అతి త్వరలోనే కరోనా ఫ్రీ తెలంగాణని చూడబోతున్నాం అన్నారు.

ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల వైద్యుల క్రికెట్‌ పోటీలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో 12 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల జట్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. పది నెలలుగా కరోనా కట్టడిలో నిమగ్నమైన కరోనా వారియర్స్‌కు ఉపశమనం కలిగించేందుకు క్రికెట్‌ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు 10వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి సిద్ధంగా ఉన్నామన్నారు. నిత్యం 10లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసేలా ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి ఈటల తెలిపారు. ఇక రేపు జరగనున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో డ్రైరన్‌ చేపట్టనునున్నారు.