‘ఉప్పెన’కు సుకుమార్ రిపేర్లు

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంతో పాటుగా కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా అందించారు. అయితే ఈ సినిమాని తన సినిమాగా భావిస్తూ వచ్చాడు సుకుమార్. సుకుమార్ సలహాలు, సూచనలు ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.
సినిమా పూర్తయిన తరవాత కూడా సుకుమార్ కొన్ని మార్పులు చెప్పడంతో, దాని అనుగుణంగా రీషూట్లు చేసి, ఉప్పెనని సిద్ధం చేశారు. ఈసినిమా ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. అయితే చివరి క్షణాల్లో సుకుమార్ మళ్లీ.. రీపేర్లు మొదలెట్టాడని తెలుస్తోంది. స్క్రీన్ ప్లేలో సుకుమార్ చిన్న చిన్న మార్పలు చేశాడని, కొన్ని సన్నివేశాల ఆర్డర్‌ని అటూ ఇటూ చేశాడని, దాంతో… కథనం మరింత పట్టుగా సాగిందని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాల్ని మరింత ట్రిమ్ చేయడంతో… ఇప్పుడు సినిమా షార్ప్ గా వచ్చిందని సమాచారమ్. ఉప్పెన హిట్ అయినా.. ఆ క్రెడిట్ కూడా సుకుమార్ ఖాతాలోనే పడేలా ఉంది.
