కరోనా కష్టాలు.. ప్రభాస్’కే ఎక్కువ !

కరోనా ఎఫెక్ట్ తో సినీ పరిశ్రమ మరోసారి మ్రూగబోయింది. చిన్నా చితకా నటి/నటుడు నుంచి పెద్ద స్టార్ వరకు కరోనా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా కష్టాలు ఎక్కువగా పడుతున్న హీరో మాత్రం ప్రభాస్ అనే చెప్పవచ్చు. ఆయన ఒకేసారి మూడ్నాలుగు సినిమాలని లైన్ లో పెట్టడమే ఇందుకు కారణం. అవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు. భారీ బడ్జెట్ సినిమాలు. ఈ నేపథ్యంలో డార్లింగ్ కరోనా కష్టాలు వర్ణనారహితం అంటున్నరు ఆయన అభిమానులు.
రాధేశ్యామ్ సెట్స్ మీద ఉండగానే.. ‘సలార్’ సినిమా షూటింగ్ ప్రారంభించాడు ప్రభాస్. మరోవైపు ‘ఆదిపురుష్’ రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. కరోనా కాటుతో వాయిదా కూడా పడింది. ఈ రెండు సినిమాలని ఒకట్రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి.. నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభించాలనే ప్లాన్ కూడా ప్రభాస్ చేశాడు. కానీ ఇప్పుడు అసలుకే ఎసరు లేదు. అన్నీ సినిమాలు వాయిదానే. తాజాగా ప్రభాస్ రాధేశ్యామ్ కూడా సమస్యలో పడింది.
ఇప్పుడు కూడా రాధా శ్యామ్ అనుకున్న సమయానికి రావడం లేదు. ఈ దసరాకి వస్తే గొప్పే అంటున్నారంతా. అయితే రాధే శ్యామ్ కి ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. ఈ సినిమాకి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు సకాలంలో జరగడం లేదని టాక్. ఎయిటీస్ నేపథ్యంలో సాగే కథ ఇది. దానికి అనుగుణంగా కొన్ని సెట్స్ వేశారు. అయితే సీజీ పై ఎక్కువగా ఆధారపడాల్సివచ్చింది. సీజీ పనులు చాలా కంపెనీల చేతుల్లో ఉంచారు. కానీ.. అవేమీ ఇప్పుడు సరిగా వర్క్ చేయడం లేదని తెలుస్తోంది. అనుకున్న సమయానికి వీఎఫ్ఎక్స్ పూర్తి కావడం కష్టమని.. ఆయా సంస్థలు చిత్రబృందానికి చెప్పేశాయట. అందుకే ఇప్పుడు రాధే శ్యామ్ టీమ్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తోందని సమాచారమ్.
