బాలీవుడ్ లో విషాదం : దిలీప్ కుమార్ ఇకలేరు !

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్(98) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులుపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఇటీవల ఆస్పత్రిలో చేరారు.ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
గతేడాది దిలీప్ కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్‌లు కరోనాతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే దిలీప్ కూడా కన్నుమూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దిలీప్ కుమార్ మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
