చిరు, బాలయ్య.. వాడీవేడి మాటలు !

మా’ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. సినీ ప్రముఖులంతా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 2గంటల వరకు ఓటింగ్ జరగనుంది. సాయంత్రం నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. రాత్రి 8గంటల లోపు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.

అగ్రకథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తదితరులు ఓటు వేశారు. ఈ సందర్భంగా చిరు, బాలయ్య వేరు వేరుగా మీడియాతో మాట్లాడారు. తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని చిరంజీవి చెప్పారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడిగా ఎన్నికలు జరగుతాయని అనుకోవడం లేదన్నారు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా తమ ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. 

‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని బాలయ్య అన్నారు. ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశానని చెప్పారు. ఏదేమైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు.. చేసేవాళ్లే. షూటింగ్స్‌లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. ‘మా’ అంతిమ లక్ష్యం నటీనటుల సంక్షేమం. ఎవరు గెలిచినా వారి వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తామని బాలయ్య అన్నారు.