కేసీఆర్ రిపీటే.. !

ఓటర్ల నాడి సీఎం కేసీఆర్ కు తెలిసినంత మరెవ్వరికి తెలియదేమో. అంత చక్కగా ఓటర్లని బుట్టలో వేసుకుంటారాయన. ఎన్నికలు ఎప్పుడొచ్చిన నిరుద్యోగులకు స్పష్టమైన హామీ ఇస్తుంటారు. త్వరలోనే భారీ ఉద్యోగ ప్రకటన అంటూ స్పీచ్ దంచి కొడతారు. అసెంబ్లీలోనూ, బయట, ఎన్నికల ప్రచారంలోనూ ఇవే మాటలు రిపీట్ చేస్తుంటారు. దీనిపై రివ్యూలు నిర్వహిస్తారు. ఇగ వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్స్. ఒకేసారి 50వేల ఉద్యోగాలు అంటూ వార్తలు వైరల్ అవుతాయి. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికలకు ముందే ఒకేసారి 50వేల ఉద్యోగాల భర్తీ అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ మరోసారి ఇవే మాటలు చెబుతున్నారు. ఈ సారి ఏకంగా 80వేల ఉద్యోగాల భర్తీ ఉంటుందని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. మరీ.. ఇన్నాళ్లు ఏం చేశారు అంటే ? జోనల్స్ సమస్య ఉంది. ఇప్పుడు అది క్లియర్ అయింది. ఈసారి తప్పక ఉద్యోగాల భర్తీ ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్ఛే మరో హామీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు. పట్నంలో ఎన్నిచ్చారో సరిగ్గా తెలియదు. కానీ పల్లెల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్కరికి ఇచ్చిన పాపన పోలేదు. హుజురాబాద్ ఎన్నికల వేళ వారిని తృప్తి పరచడానికి సొంత స్థలం ఉన్నోళ్లకి రూ. 5లక్షలు ఇస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలోనే ఈ మాటలు చెప్పారు. కానీ అమలు చేసిన పాపన పోలేదు. నిరుద్యోగ భృతిపై నోరుమెదపడం లేదు.

ఈసారి కేసీఆర్ ఓ విషయాన్ని మాత్రం మరిచిపోయారు. అదే ఢిల్లీ గత్తర లేపుతా. త్వరలోనే ఢిల్లీకి వెళ్తా. అన్ని పార్టీలని ఏకం చేస్తా. బీజేపీ, కాంగ్రెస్ యేటర పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కృషి చేస్తానని ఈసారి కేసీఆర్ చెప్పడం లేదు. ఎందుకంటే ? టీఆర్ ఎస్ నే ఎన్ డీయేలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దానికి ఫలితంగా కేసీఆర్ ఉపరాష్ట్రపతి, కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తానికి.. హుజురాబాద్ ఎన్నికల వేళ.. కేసీఆర్ ఉద్యోగాల భర్తీ, ఇళ్ల నిర్మాణం.. తదితర మాటలని రిపీట్ చేస్తున్నారు. అందుకే కేసీఆర్ రిపీటే.. అంటూ యూత్ సటైర్లు వేస్తున్నారు.