బాలయ్య హీరోయిన్ కి మళ్లీ కరోనా


కరోనా విజృంభించిన సమయంలో సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కరోనా బారినపడ్డారు. అయితే ఇప్పుడు కరోనా ఉదృతి తగ్గింది. తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం కరోనా బారినపడుతున్న సెలబ్రెటీల సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి సమయంలో హీరోయిన్‌ ప్ర‌గ్యా జైస్వాల్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తను పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘ఆదివారం నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నాను. ఇంత‌క‌ముందు క‌రోనా బారిన ప‌డ్డాను. ఇప్పడు మ‌ళ్లీ క‌రోనా వ‌చ్చింది .ప్ర‌స్తుతం నేను ఐసోలేషన్లో ఉన్నాను. గత 10 రోజులుగా నన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి’ అని ప్రగ్యా సూచించింది. ప్రస్తుతం ప్రగ్యా అఖండ సినిమాలో బాలయ్యకు జంటగా నటిస్తుంది. ఇప్పుడు ఆమెకు కరోనా పాజిటివ్ గా రావడంతో.. అఖండ్ చిత్రబృందంలో కరోనా కలవరం ఏర్పడింది.