ప్రకాష్ రాజ్ ఫైర్ : రేయ్.. రారా.. నాపై గెలవరా ?

మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఒక్క ప్రశాంత్ కిషోర్ (పీకే) మాత్రమే లేడు. మిగితాదంతా సేమ్ టు సేమ్. ఎన్నికల హీట్ పీక్స్ చేరుకుంది. బయట ప్రశాంతంగా కనిపిస్తున్న.. లోపల మాత్రం గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే సీనియర్ నరేశ్ వచ్చిన సమయంలో ప్రకాష్ కంట్రోల్ కోల్పోయాడు. అరేయ్.. రారా.. నాపై గెలవరా ? గట్టిగా అరిచారు ప్రకాశ్ రాజ్. నరేష్ ఏమైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా ? అందుకు ప్రకాష్ సీరియస్ అయ్యారా ? అన్నది తెలియాల్సి ఉంది.

మరోవైపు శివబాలాజీ చేయిని హేమ గట్టిగా కొరుకున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఈ గొడవపై శివబాలాజీ దాటవేసే ధోరిణిలో స్పందించారు. అసలు ఏమీ జరగలేదన్నారు. హేమ మాత్రం శివబాలాజీని కొరికిన మాట వాస్తవమే. లోపల ఒకరిని పట్టుకొని పది మంది కొడుతున్నారు. అక్కడకి వెళ్లే క్రమంలో శివబాలాజీ చేయి కొరికినట్టు తెలిపారు. మొత్తానికి సిన్మా రాజకీయం ఆసక్తిగా సాగుతోంది. మరీ.. ఈ పోరులో ఎవరు గెలుస్తారు ? అన్నది మరికొన్ని గంటల్లో తెలియనుంది.