సన్నీలియోన్ కు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్ !

శృంగార తార సన్నీలియోన్ బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమె ఎన్నో అనుమానాలను ఎదుర్కొంది. వాటి గురించి పలు ఇంటర్వ్యూలో చెప్పింది సన్నీ. అయితే ఇప్పటికీ ఈ బ్యూటీకి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. ఆమె నటించిన కొత్త పాట ‘మధుబన్’ లాంచ్ అయింది. సన్నీ కూడా ఈ పాటను విపరీతంగా ప్రమోట్ చేసింది, అయితే ఇప్పుడు ఈ పాట వివాదాల్లో చిక్కుకుంది.

మధుబన్ పాట మ్యూజిక్ వీడియోను చూసిన ప్రజలు సోషల్ మీడియాలో సన్నీ లియోన్‌ను ట్రోల్ చేస్తున్నారు. దీంతో యూజర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. యూట్యూబ్ నుంచి ఈ పాటను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ‘మధుబన్’ పాటకు సంబంధించి, ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని అంటున్నారు. ఈ పాట ‘మధుబన్ మే రాధిక నాచే రే’ లిరిక్స్ గురించి, ఇందులో సన్నీ డ్యాన్స్ చేసిన విధానం మరియు ఈ పాటలోని సాహిత్యం ప్రకారం ఆమె చాలా అభ్యంతరకరంగా ఉందని అంటున్నారు.