బింబిసార.. పార్టీ టైమ్ !

మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమా చూడ్డానికి థియేటర్లకు వస్తారని బింబిసార, సీతారామం సినిమాలు నిరూపించాయి. కంటెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఈ సినిమాలు అద్బుత‌మైన వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాయి. చాలా రోజుల త‌ర్వాత హిట్ అనే మాట విన‌డంతో టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. చిరంజీవి, నాగార్జున‌, అల్లు అర్జున్‌తో పాటు ప‌లువురు అగ్ర‌హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సీతారామం, బింబిసార టీమ్‌ల‌ను అభినందిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు అయితే బింబిసార టీమ్ కు స్పెషల్ పార్టీ ఇచ్చారు.

ఆదివారం నాటితో ఈసినిమా బ్రేక్ ఈవెక్ కావ‌డమే కాకుండా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ స‌క్సెస్‌ను పుర‌స్క‌రించుకొని బింబిసార టీమ్‌కు నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ , నిర్మాత దిల్‌రాజు ఆదివారం స‌క్సెస్ పార్టీని ఇచ్చారు. ఈ పార్టీలో క‌ళ్యాణ్‌రామ్‌, ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ తో పాటు మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ డ్యూయ‌ల్ రోల్ లో క‌నిపించారు. బింబిసారుడిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో అత‌డి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.