ప్రియాంక పూల్ పిక్.. ఈ సారి సింగిల్ గానే !

మొగుడు నిక్ జోనాస్ తో కలిసి ఎక్కడ పడితే అక్కడ రెచ్చిపోవడం.. రొమాన్స్ చేయడం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు అలవాటే. ఇటీవల వాటిలో ది బెస్ట్ పిక్ ఒకటి నిక్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఇందులో ఆరెంజ్ కలర్ డ్రెస్ ప్రియాంక హాట్ కనిపిస్తుండగా.. ఆమె వెనుక ట్రెండీ లుక్ లో నిక్ నిల్చున్నాడు. అయితే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. అయితే తాజాగా ప్రియాంక సింగిల్ గానే రంగంలోకి దిగింది.
స్విమ్మింగ్ పూల్ ఎదుట కిర్రాక్ పోజులు ఇచ్చింది. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్, కళ్లకు సన్ గ్లాసెస్, పైన క్యాప్ తో పోజులు కొట్టింది. ఇక ఫరాన్ అక్తర్ దర్శకత్వంలో ప్రియాంక చోప్రా-కత్రినా కైఫ్-అలియా భట్ కలిసి నటించనున్న రోడ్ ట్రిప్ ఫిల్మ్ ‘జీ లే జరా’ షూటింగ్ వచ్చే ఏడాది షురూ కానుంది. ఈ సినిమాలో యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

