బ్లూ డ్రెస్ లో తాప్సీ.. ఎంత ముద్దుగా ఉందో.. !

సొట్టబుగ్గల సుందరి తాప్సీకి టాలీవుడ్ లో పెద్దగా కలిసిరాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం హవా చూపిస్తోంది. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. లేడీ ఓరియెంటెండ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అంతేకాదు.. నిర్మాతగా మారి తన టేస్ట్ తగ్గ సినిమాలు నిర్మించే పని కూడా మొదలుపెట్టింది.

తాప్సీ పన్ను, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘దోబారా’. 2018లో విడుదలైన స్పానిష్ సినిమా ‘మిరాజ్’కి రీమేక్ ఇది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ మిస్టరీ డ్రామా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బ్లూ డ్రెస్ లో మెరిసింది తాప్సీ. కలర్ ఫుల్ గా కనిపించింది.

