టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా (ఆగస్టు 9) ‘పోకిరి’ సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 200కు పైగా స్క్రీన్లపై పోకిరి స్పెషల్ షోస్ ప్రదర్శించబడ్డాయి. హైదరాబాద్ లోని అన్ని ప్రధాన థియేటర్స్ లో పోకిరి షోస్ పడ్డాయి. హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచాయి. అంతేకాదు.. పండుగాని మరోసారి థియేటర్స్ లో చూడ్డానికి అమ్మాయిలు పోటీ పడ్డారు. థియేటర్స్ లో ఈలలు, కేకలు, డ్యాన్సులతో హంగామా చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ అభిమానుల పోకిరి రీ రిలీజ్ ఆనందాన్ని చూసి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త డిమాడ్ ను తెరపైకి తెచ్చారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా ‘జల్సా’ సినిమాను రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. #SanjaySahuArrivingSoon అంటూ యాష్  ట్యాగ్ వైరల్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్ దేవరకొండ.. ఇలా ప్రతి స్టార్ హీరో అభిమానులు రీ రిలీజ్ పై ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.

ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఆది, సింహాద్రి, ఆర్ఆర్ఆర్, టెంపర్.. వీటిలో ఒక సినిమాను రీ రిలీజ్ కోసం డిమాండ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ మగధీర కు ఓటెస్తే.. విజయ్ దేవరకొండ అభిమానులు అర్జున్ రెడ్డి అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలి పేరు చెబుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులు పుష్ప సినిమాను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇలా.. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. దానికి ట్రెండ్ సెట్టర్ గా మహేష్ నిలిచిపోనున్నారు. అన్నట్టు.. రీ రిలీజ్ విషయంలోనూ రికార్డులు లెక్కకడుతున్నారు ఫ్యాన్స్. 

Mahesh Babu Is A Great Human Being..He Is Doing So Much For The Society – Lady Cult Fans❤️🙏💥 pic.twitter.com/gyGh0uDd2Y— Naveen MB Vizag 🔔 (@NaveenMBVizag) August 11, 2022