వైరల్ : కొరియన్ గర్ల్స్ తో ఐకాన్ స్టార్ డ్యాన్స్

కొరియన్‌ గర్ల్స్‌తో టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పుల వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఐకాన్ స్టార్ తొలిసారి ఓ మ్యూజిక్‌ కమ్‌ డ్యాన్స్‌ వీడియో చేశారు. ఇందులో కొరియన్‌ పాప్‌ గ్రూప్‌ అయిన TRI.BE గర్ల్స్‌తో కలిసి బన్నీ స్టెప్పులేయడం విశేషం.

మేము ఆగము.. అసలు ఆగము అంటూ బాలీవుడ్‌ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ పాడిన పాటకు బన్నీ స్టెప్స్‌ అదుర్స్‌ అనిపించేలా ఉన్నాయి. కోక్‌ స్టూడియోతో తొలిసారి చేతులు కలిపిన అల్లు అర్జున్‌.. ఈ మ్యూజిక్‌ కమ్‌ డ్యాన్స్ వీడియో చేశాడు. బ్యాగీ ప్యాంట్స్‌, బ్లాక్‌ షర్ట్‌, రెడ్‌ జాకెట్‌లో బన్నీ అదిరిపోయే లుక్‌లో కనిపించాడు.ఈ సాంగ్‌ను లాస్ట్‌ స్టోరీస్‌ & ఎల్లీ కంపోజ్‌ చేశారు. కునాల్‌ వర్మ, ఎల్లీ, ఎస్‌.టైగర్‌ లిరిక్స్‌ అందించారు. ఈ సాంగ్‌ను డైరెక్ట్‌ చేసింది కొలిన్‌ డీ’కున్యా. ఈ మ్యూజిక్‌ వీడియోలో అల్లు అర్జున్‌, అర్మాన్‌ మాలిక్‌, కొరియన్‌ పాప్‌ గ్రూప్‌ ట్రైబ్‌ కనిపించారు.

ఇక పుష్ప 2 సోమవారం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతల బంద్ కొనసాగుతోంది. అది పూర్తయిన వెంటనే పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. పుష్ప 2 కోసం దేవిశ్రీ ఇప్పటికే మూడు పాటలు రెడీ చేశారు. ఇందులో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉందట. ఈ సారి ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలనే ప్లాన్ లో సుకుమార్ ఉన్నట్టు సమాచారం.