అనూష శెట్టితో నాగశౌర్య లవ్ మ్యారేజ్ ?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి ఫిక్సయిన సంగతి తెలిసిందే. అనూష శెట్టి అనే అమ్మాయితో ఏడడుగులు వేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీరి వివాహం ఈ నెల 20న ఉదయం 11:25 గంటలకు జరగనుంది. బెంగళూరుకు చెందిన అనూష ప్రస్తుతం ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

అయితే వీరిది ప్రేమ పెళ్లా ? పెద్దలు కుదిర్చిన పెళ్లా ? అనే చర్చ జరుగుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలిసింది. ఇక సినిమాల విషయానికొస్తే.. నాగశౌర్య ఇటీవలే ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ప్రస్తుతం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారు.