నాని ఆఫీసులో శేషు రొమాన్స్

నేచురల్ స్టార్ నాని ఆఫీసులో హీరో శేష్ రొమాంటిక్ సాంగ్ వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం నాని కూడా తెలియదట.  అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ 2’. డిసెంబర్‌ 2న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ షురూ చేసింది.

నాని ప్రారంభించిన ‘వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌’ బ్యానర్‌పై తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ -2’. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ కార్యాలయానికి చేరుకున్న శేష్‌-మీనాక్షి ‘ఉరికే’ పాటకు డ్యాన్స్‌ చేశారు. 

‘‘అవును.. నేను ‘ఉరికే ఉరికే’ పాటకు డ్యాన్స్‌ చేశా. ఇలా డ్యాన్స్‌ చేయడం కాస్త సిగ్గుగానే ఉంది. అయినా మీకోసం ఏదైనా చేస్తా’’ అంటూ శేష్ వీడియో షేర్‌ చేశాడు. దీనిపై నాని స్పందిస్తూ.. ‘‘నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడొచ్చా?’’ అని ప్రశ్నించాడు. హిట్ సీక్వెల్ గా హిట్ 2 తెరకెక్కుతోంది.  అడివి శేష్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. 

Yes! I danced to #UrikeUrike 🫢 A bit shy to dance but… anything for YOU guys ❤️

https://t.co/VjRpTQEYFH#HIT2onDec2@nameisnani @KolanuSailesh @Meenakshiioffl @sidsriram #RamyaBehara@tprashantii pic.twitter.com/VjneepJT7R— Adivi Sesh (@AdiviSesh) November 12, 2022