‘పుష్ప-2’లో రామ్‌చరణ్‌.. ?

  సుకుమార్-అల్లు అర్జున్ ల ‘పుష్ప ది రైజ్‌’ ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ సక్సెస్‌ అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్‌’ తెరకెక్కుతోంది. అయితే ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింటిని షేక్‌ చేస్తోంది. పార్ట్‌-1తో పోలిస్తే.. పార్ట్‌-2 మరింత ఆసక్తికరంగా ఉండనుందని, ఇందులో ఎంతోమంది స్టార్స్‌ కనిపించనున్నారని సమాచారం. ఈ మేరకు రామ్‌చరణ్‌ సైతం ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారని, బన్నీతో కలిసి ఆయన స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారని.. నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై సుకుమార్‌ ఇప్పటికే చెర్రీని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

 ఇదిలా ఉంటే పుష్ప-2 డైలాగ్స్ లీకయ్యాయంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొన్ని డైలాగులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. “అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే?.. పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం.” అనే డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది కాకుండా మరో డైలాగ్ కూడా చక్కర్లు కొడుతోంది. “వాళ్లు గొర్రెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొర్రెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” అనే సంభాషణ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.