శ్రుతిహాసన్‌ ను ఇబ్బంది పెట్టింది ఎవరు ?

సంక్రాంతి సినిమాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఈ రెండింటిలోనూ శృతిహాసన్ నే హీరోయిన్. కానీ బాలయ్య సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శృతి.. మెగాస్టార్ కు మాత్రం మొండిచేయి చూపించింది. అనారోగ్యం కారణంగానే వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరు కాలేకపోయానని చెప్పింది. కానీ లోపల శృతి ఎక్కడ అసంతృప్తికి గురయ్యారు అనే వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత శృతి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అంటూ ఓ రూమర్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా శృతి స్పందించారు. తాను మానసిక సమస్యలతో ఇబ్బందిపడటం లేదని.. కేవలం వైరల్‌ ఫీవర్‌తోనే ఇబ్బందిపడుతున్నానని చెప్పారు.నన్ను ఇబ్బందిపెట్టడానికి బాగా ప్రయత్నించారు. ఒకవేళ మీరు మానసిక సమస్యలతో ఇబ్బందిపడితే.. వైద్య నిపుణులను సంప్రదించండి అంటూ ఘూటుగా స్పందించింది.