గౌతమ్ తిన్నమూరితో రౌడీ సినిమా

‘జెర్సీ’ సినిమాతో ప్రతిభగల దర్శకుడు అనిపించుకున్నాడు గౌతమ్ తిన్నమూరి. టాలీవుడ్ ‘జెర్సీ’ ని బాలీవుడ్ లో రిమేక్ చేసి.. అక్కడ విజయం అందుకున్నారు. షాహిద్ కపూర్ హీరోగా హిందీ జెర్సీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండతో గౌతమ్ ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ మరికొద్దిసేపట్లో రానుంది అంటున్నారు.

వాస్తవానికి.. హిందీ జెర్సీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని గౌతమ్ భావించారు. చరణ్ కు కథ చెప్పారు కూడా. ఆయనకు నచ్చింది. అయితే ఈలోగా శంకర్ సినిమా ఆఫర్ రావడంతో.. ఈ ప్రాజెక్టు పక్కకుపోయినట్టు సమాచారం. దీంతో.. రౌడీ కథ చెప్పి ఒప్పించారు గౌతమ్. అయితే అది రామ్ చరణ్ కోసం రాసుకున్న కథేనా… ? లేదా కొత్త కథతో విజయ్ తో సినిమా ఉంటుందా ? అన్నది తెలియాల్సి ఉంది.