పెళ్లి ప్రకటన చేసిన మంచు మనోజ్

యంగ్ హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పారు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. “పెళ్లి కూతురు భూమా మౌనికా రెడ్డి” అంటూ ఆమె ఫోటో ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో మంచు మనోజ్ రెండో పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చినట్టయింది. అంతేకాదు.. ఈ రోజు రాత్రి వీరి వివాహం జరగనుందని సమాచారం.

2015లోనే మనోజ్‌కు ప్రణతీరెడ్డితో వివాహమైంది. అయితే 2019లో వీరిద్దరూ విడిపోయారు. కొంతకాలంగా భూమా మౌనికా రెడ్డి తో మనోజ్ సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. మనోజ్ కూడా ఈ వార్తలను ఖండించలేదు. త్వరలో గుడ్ న్యూస్ ఉంటుందని ఊరించారు. తాజాగా ఆ గుడ్ న్యూస్ ను చెప్పేశారు.