#PKDST టైటిల్ ‘దేవర’.. జులై 28న రిలీజ్ !

స‌ముద్ర‌ఖ‌ని దర్శకత్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ కలయికలో ఓ సినిమా ( #PKDST) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.  త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన వినోదాయ సీత‌మ్‌కి ఇది రీమేక్‌ ఇది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. జులై 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారంగా ప్రకటించారు కూడా.

ఐతే ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది ఇంకా తెలీలేదు. ఈ శ్రీ‌రామ‌న‌వ‌మికి టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ చిత్రానికి దేవ‌ర‌ అనే టైటిల్ ఫిక్స్ చేసే అవ‌కాశం ఉంది.  గోపాల‌.. గోపాల‌ త‌ర‌హా క‌థ ఇది. అందులో ప‌వ‌న్ దేవుడిగా క‌నిపించాడు. ఇందులోనూ ప‌వ‌న్‌ది అలాంటి పాత్రే అంటున్నారు. అయితే దేవర టైటిల్ మరో నిర్మాత దగ్గర ఉంది. ఆయన్ని పవన్ స్వయంగా అడిగితే కాదనరు అంటున్నారు.