బుల్లెట్ గాయాలతో పుష్ప పరార్ !

బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమా ‘పుష్ప’. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప 2 రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ‘అసలు పుష్ప ఎక్కడ?’ అంటూ చిత్ర బృందం తాజాగా ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది. తిరుపతి పోలీస్ స్టేషన్ నుంచి పుష్ప బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన గ్లింప్స్ లో ఉద్రిక్త పరిస్థితులు చూపించారు. పుష్ప కోసం ఆందోళనలు, నినాదాలతో గ్లింప్స్ కట్ చేశారు. ఇక ఈ నెల 7న పుష్ప టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో బన్నీ లుక్.. మరింత సమాచారం అందించబోతున్నారు.

ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. పార్ట్-1 లో మెయిన్ విలన్ గా ఫాహాద్ ఫాజిల్ నటించారు. సీక్వెల్ లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సునీల్, అనసూయ తదితర పాత్రలు కొనసాగనున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.